తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇకపై ప్రతి మండే.. మహేశ్ ఫ్యాన్స్​కు ఫన్​డే..! - mahesh babu latest news

సరిలేరు నీకెవ్వరు చిత్ర ప్రమోషన్లను వినూత్నంగా నిర్వహించనుందట చిత్రబృందం. ఇప్పటి నుంచి సంక్రాంతి పండగ వరకు సినిమాకు సంబంధించిన వీడియోలు, పోస్టర్లు, సాంగ్స్​తో అలరించనుందట.

sarileru neekevvaru movie
ఇకపై ప్రతి మండే.. మహేశ్ ఫ్యాన్స్​కు ఫన్​డే..!

By

Published : Nov 27, 2019, 7:06 PM IST

ఈ ఏడాది మహర్షితో భారీ విజయాన్ని అందుకున్న టాలీవుడ్ సూపర్​స్టార్ మహేశ్ బాబు.. సరిలేరు నీకెవ్వరుతో పలకరిచనున్నాడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్రమోషన్లను వినూత్నంగా చేయనున్నారు. ఇకపై ప్రతి సోమవారం సినిమాకు సంబంధించిన విషయాలను వెల్లడిస్తూ ప్రచారం నిర్వహించనున్నారట.

జనవరి 11న విడుదల కానున్న ఈ సినిమా ప్రచారంలో భాగంగా చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, పాటలు, వీడియో క్లిప్పింగ్స్​తో ఫ్యాన్స్​ను ఖుషీ చేయనుందట చిత్రబృందం. ప్రతి సోమవారం ఇలాంటి సర్​ప్రైజ్​లతో ప్రమోషన్​ చేస్తారట. ఇప్పటి నుంచి పండగ వరకు ప్రతి మండే అభిమానులకు ఫండేనే.
అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్‌కు జోడీగా రష్మిక నటిస్తుండగా.. విజయశాంతి, ప్రకాష్‌రాజ్, రాజేంద్రప్రసాద్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో పోషిస్తున్నారు.

ఇది చదవండి: ప‌వ‌న్ క‌ల్యాణ్ 'జార్జ్​రెడ్డి' పాత్ర చేయాల‌నుకున్నారు!

ABOUT THE AUTHOR

...view details