తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహేశ్​బాబు కోసం ప్రత్యేకంగా ఓ రైలు..! - అనిల్ రావిపూడి

మహేశ్​ కొత్త సినిమా 'సరిలేరు నీకెవ్వరు' కోసం అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా రైలు సెట్​ను రూపొందించారు. ప్రస్తుతం కశ్మీర్​లో చిత్రీకరణ జరుపుకుంటోందీ చిత్రం.

మహేశ్​బాబు కోసం ప్రత్యేకంగా ఓ రైలు..!

By

Published : Jul 5, 2019, 8:46 PM IST

ఇటీవలే 'మహర్షి'తో విజయాన్ని అందుకున్నాడు హీరో మహేశ్​బాబు. కొత్త సినిమా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రీకరణలో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. కశ్మీర్​లో తొలి షెడ్యూల్ జరుపుకోనుంది. అనిల్ రావిపూడి దర్శకుడు. రష్మిక మందణ్న హీరోయిన్. 2020 సంక్రాంతికి విడుదల కానుంది.

హీరో మహేశ్​ను కశ్మీర్‌కు పంపేందుకు వీలుగా అన్నపూర్ణ స్టూడియో నుంచి ప్రత్యేకంగా ఓ రైలు వేయించబోతున్నారట దర్శకుడు అనిల్ రావిపూడి. ‘ఏంటి.. ఇక్కడ నుంచి ప్రత్యేక రైల్లో పంపిస్తున్నారా?’ అని ఆశ్చర్యపడకండి. చిత్రంలో మహేశ్​ కశ్మీర్ నుంచి ఆంధ్రాకు రైలులో ప్రయాణిస్తాడు. అందులో ముఖ్యమైన కామెడీ సీన్లు ఉన్నాయి. అవి అవుట్​డోర్​లో తీస్తే అభిమానులతో ఇబ్బంది ఎదురయ్యే అవకాశముంది. అందుకే ప్రత్యేక రైలు సెట్​ను రూపొందించేందుకు సిద్ధమైంది చిత్రబృందం.

సరిలేరు నీకెవ్వరు పోస్టర్

ఇందులో మహేశ్​బాబు ఆర్మీ మేజర్​గా కనిపించనున్నాడు. దాదాపు 13 ఏళ్ల విరామం తర్వాత నటి విజయశాంతి ఈ సినిమాతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. 'ఎఫ్​2'తో హిట్ అందుకున్న అనిల్.. మరోసారి ఆ మ్యాజిక్ పునరావృతం చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

హీరో మహేశ్​బాబు

ఇది చదవండి: రష్మిక-దేవరకొండ లవ్​ట్రాక్​పై మహేశ్​బాబు ట్వీట్​

ABOUT THE AUTHOR

...view details