తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈ మేకింగ్ వీడియోకు 'సరిలేదు'..! - Mahesh Babu

సరిలేరు నీకెవ్వరు మేకింగ్ వీడియోను విడుదల చేశాడు మహేశ్. సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చక్కగా చూపించారు. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

Sarileru Neekevvaru Making Video Release
సరిలేరు నీకెవ్వరు

By

Published : Jan 9, 2020, 1:19 PM IST

గతేడాది వెంకటేష్‌ - వరుణ్‌తేజ్‌లతో సంక్రాంతికి 'ఎఫ్‌ 2' రూపంలో నవ్వులు పంచిన అనిల్‌ రావిపూడి.. ఈసారి పండక్కి మహేష్‌తో 'సరిలేరు నీకెవ్వరు' అంటూ ‘నెవర్‌ బిఫోర్‌.. ఎవర్‌ ఆఫ్టర్‌’ అనే రీతిలో వినోదాల విందు వడ్డించబోతున్నాడు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మహేష్‌ ఓ సర్‌ప్రైజింగ్‌ వీడియోను విడుదల చేశాడు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల మేకింగ్‌ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.

ముఖ్యంగా చిత్రానికి ప్రధాన ఆకర్షణగా చెప్తోన్న రైలు ఎపిసోడ్‌, కొండారెడ్డి బురుజు మేకింగ్‌ ప్రతిదాన్నీ ఎంతో చక్కగా చూపించారు. ఈ మేకింగ్‌ వీడియోలో తొలి సీన్‌ నుంచి మలి సన్నివేశం వరకు మహేష్‌బాబు, అనిల్, ఇతర చిత్ర బృందమంతా చిరునవ్వులు చిందిస్తూనే దర్శనమిచ్చింది. మరి చిత్రీకరణలోనే వీళ్లు ఇంతలా ఎంజాయ్‌ చేశారంటే తెరపై చూస్తున్నప్పుడు ప్రతి ప్రేక్షకుడు కడుపు చెక్కలయ్యేలా నవ్వడం ఖాయమని అర్థమవుతోంది.

ఇందులో మహేష్‌కు జోడీగా రష్మిక నటిస్తుండగా.. విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, బండ్ల గణేష్‌, సంగీత తదితరులు కీలక పాత్రల్లో కనువిందు చేయనున్నారు. ఈ నెల 11 ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇదీ చదవండి: ఛపాక్ చిత్రానికి అడ్డంకి.. విడుదల ఆపాలని కోర్టులో కేసు

ABOUT THE AUTHOR

...view details