తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సరిలేరు నీకెవ్వరు'.. కేరళలో సరదా సరదాగా - rashmika-mahesh

కేరళలో షూటింగ్ జరుపుకుంటోన్న 'సరిలేరు నీకెవ్వరు' బృందం ఆ ఫొటోను పంచుకుంది. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

'సరిలేరు నీకెవ్వరు'.. కేరళలో సరదా సరదాగా

By

Published : Nov 8, 2019, 8:52 PM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబు నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం కేరళలో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విట్టర్​లో పంచుకుంది చిత్రబృందం. ఇందులో మహేశ్​తో పాటు ప్రకాశ్​రాజ్, రాజేంద్ర ప్రసాద్, విజయశాంతి, రష్మిక, సంగీత తదితరులు ఉన్నారు.

ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకుడు. అనిల్ సుంకర, దిల్​రాజ్, మహేశ్​బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

దర్శకుడు అనిల్ రావిపూడితో హీరో మహేశ్​బాబు
దీపావళి సందర్భంగా విడుదల చేసిన 'సరిలేరు నీకెవ్వరు' పోస్టర్

ABOUT THE AUTHOR

...view details