తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దద్దరిల్లిన బొమ్మ.. 'సరిలేరు..' కలెక్షన్ల హంగామా - tollywood news

సూపర్​స్టార్ 'సరిలేరు నీకెవ్వరు'.. తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని విశ్లేషకులు వెల్లడించారు.

దద్దరిల్లిన బొమ్మ.. 'సరిలేరు..' కలెక్షన్ల హంగామా
సరిలేరు నీకెవ్వరు తొలిరోజు కలెక్షన్లు

By

Published : Jan 12, 2020, 4:00 PM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబు 'సరిలేరు నీకెవ్వరు'.. తొలిరోజు విశేషమైన కలెక్షన్లు రాబట్టింది. శనివారం వచ్చిన ఈ సినిమా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు రూ.32.77 కోట్లు వసూలు చేసిందని విశ్లేషకులు వెల్లడించారు.

నైజాంలో రూ.8.66 కోట్ల, సీడెడ్​లో రూ.4.15 కోట్లు,యూఏ(ఉత్తరాంధ్ర)లో రూ.4.4 కోట్లు, కృష్ణలో రూ.3.07 కోట్లు, గుంటూరులో రూ.5.15 కోట్లు, తూ.గోలో రూ.3.35 కోట్లు, ప.గోలో రూ.2.72 కోట్లు, నెల్లూరులో రూ.1.27 కోట్లు సాధించిందని చెప్పారు. అమెరికాలోని 294 స్క్రీన్లలో రూ.5.39 కోట్లు రాబట్టినట్లు పేర్కొన్నారు. ఇది ఓ అద్భుతమైన ఆరంభమని విశ్లేషకులు అన్నారు.

సూపర్​స్టార్ మహేశ్​బాబు 'సరిలేరు నీకెవ్వరు'

ఈ సినిమాలో మహేశ్​ ఆర్మీ మేజర్​గా కనిపించాడు. రష్మిక హీరోయిన్. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. విజయశాంతి, ప్రకాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్రసాద్‌, సంగీత తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఇది చదవండి: 'సాహో' రికార్డును అధిగమించిన 'సరిలేరు నీకెవ్వరు'!

ABOUT THE AUTHOR

...view details