తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు' విడుదల తేదీ మార్పు! - మహేశ్​బాబు-అల్లు అర్జున్

ఈ పండక్కి రాబోతున్న 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' సినిమాల విడుదల తేదీలు మారనున్నాయనే వార్తలు.. ప్రస్తుతం సోషల్​ మీడియాలో జోరందుకున్నాయి. చిత్రబృందాలు తాజాగా విడుదల చేసిన పోస్టర్లే ఇందుకు కారణం. మరి వీటిలో నిజమెంత?

'సరిలేరు నీకెవ్వరు' విడుదల తేదీ మార్పు!
'సరిలేరు నీకెవ్వరు'లో సూపర్​స్టార్ మహేశ్​బాబు

By

Published : Jan 2, 2020, 8:01 PM IST

Updated : Jan 2, 2020, 8:13 PM IST

ఈ సంక్రాంతికి టాలీవుడ్​ బాక్సాఫీస్ ముందు భారీ​ సినిమాలు బరిలో ఉన్నాయి. సూపర్​స్టార్ మహేశ్​బాబు 'సరిలేరు నీకెవ్వరు', స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో'​ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ముందుగా ఈ రెండింటిని ఒకేరోజు(జనవరి 12) విడుదల చేయాలనుకున్నారు. ఆ తర్వాత నిర్మాతల మధ్య కుదిరిన సయోధ్య కారణంగా మహేశ్​బాబు ఓ రోజు(జనవరి 11) ముందుకు జరిగాడు. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఈ సినిమాల విడుదల తేదీలు మారే అవకాశముందట.

ఇంతకీ కారణమేంటి?

మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు' గురవారం సెన్సార్ పూర్తి చేసుకుంది. యూబైఏ సర్టిఫికెట్ వచ్చింది. కొత్త పోస్టర్​ను అభిమానులతో పంచుకున్నారు. అయితే ఇందులో సంక్రాంతికి విడుదల అని మాత్రమే ఉంది. తేదీని మాత్రం ముద్రించలేదు. ఈ విషయం ప్రిన్స్ ఫ్యాన్స్​ను కలవరపెడుతోంది.

సెన్సార్ అనంతరం 'సరిలేరు నీకెవ్వరు' కొత్త పోస్టర్

బన్నీ 'అల వైకుంఠపురములో' సినిమా విషయంలోనూ, రిలీజ్​ డేట్ జనవరి 10కి​ మార్చాలని నిర్మాతలు భావిస్తున్నారట. బయ్యర్లు తెస్తున్న ఒత్తిడే ఇందుకు కారణమని టాలీవుడ్ వర్గాల టాక్. నూతన సంవత్సరం సందర్భంగా చిత్రబృందం పంచుకున్న పోస్టర్లలో విడుదల తేదీ వేయలేదు. ఈ కారణంగానే అభిమానుల మదిలో సందేహాలు మొదలయ్యాయి.

'అల వైకుంఠపురములో' నూతన సంవత్సర పోస్టర్
Last Updated : Jan 2, 2020, 8:13 PM IST

ABOUT THE AUTHOR

...view details