తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మూడు రోజుల్లో సెంచరీ కొట్టిన మహేశ్​ - cinema news

ప్రిన్స్ మహేశ్​బాబు 'సరిలేరు నీకెవ్వరు'.. వచ్చిన మూడురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.103 కోట్ల గ్రాస్​ వసూలు చేసింది. చిత్రబృందం ఈ విషయాన్ని వెల్లడించింది.

మూడు రోజుల్లో సెంచరీ కొట్టిన మహేశ్​
సూపర్​స్టార్ మహేశ్​బాబు

By

Published : Jan 14, 2020, 4:05 PM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబు కొత్త సినిమా 'సరిలేరు నీకెవ్వరు'.. మూడు రోజుల కలెక్షన్లలో సెంచరీ మార్క్​ను అందుకుంది. రూ.103 కోట్ల గ్రాస్​ సాధించింది. చిత్రబృందం ఆ పోస్టర్​ను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శితమవుతోందీ చిత్రం.

ఇందులో మహేశ్​.. ఆర్మీ మేజర్​గా కనిపించాడు. రష్మిక హీరోయిన్. విజయశాంతి, ప్రకాశ్​రాజ్, రాజేంద్రప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. అనిల్ రావిపూడి దర్శకుడు. మహేశ్​బాబు-దిల్​రాజు-అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు.

మూడురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.103 కోట్ల గ్రాస్​ వసూలు

ABOUT THE AUTHOR

...view details