తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విక్కీ కౌశల్​ 'ఉద్దమ్ సింగ్' చిత్రీకరణ పూర్తి - విక్కీ ఉరి సినిమా

'ఉరి: ది సర్జికల్​ స్టైక్​' వంటి దేశభక్తి సినిమాలో అద్భుతంగా నటించి అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు విక్కీ కౌశల్​. ఇదే తరహాలో 'ఉద్దమ్ సింగ్' అనే మరో దేశభక్తి చిత్రంతో అలరించనున్నాడీ నటుడు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది.

sardaruddhamsingh udhamsingh sujeetsircar risingsu
మరోసారి దేశభక్తి చాటనున్న విక్కీ కౌశల్​

By

Published : Dec 28, 2019, 10:48 AM IST

సర్దార్​ ఉద్దమ్​ సింగ్​ జీవిత కథతో సుజీత్​ సర్కార్​ ఓ దేశభక్తి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను రైజింగ్​ సన్​ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. నిన్నమొన్నటి వరకు యూరప్​లో చిత్రీకరణ జరుపుకొన్న ఈ సినిమా తాజాగా తుది షెడ్యూల్​ను పూర్తి చేసుకుంది. చిత్రబృందం ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా అభిమానులకు తెలియజేసింది. యూరప్​ వీధుల్లో దిగిన ఫొటోనూ షేర్​ చేసింది.

కథ ఏంటంటే...

1919.. పంజాబ్​లో జలియాన్​వాలా బాగ్​ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో నాటి పంజాబ్​ గవర్నర్​ జనరల్​ మైఖల్​ ఓ డయ్యర్​ శాంతియుతంగా సమావేశం ఏర్పాటు చేసుకున్న భారతీయులపై పోలీసులతో కాల్పులు జరిపించాడు. ఈ కాల్పుల్లో వేలాది మంది భారతీయులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అయితే దీనికి ప్రతీకారంగా నాటి విప్లవ వీరుడు ఉద్దమ్​ సింగ్​ డయ్యర్​ను లండన్​లో మార్చి 13, 1940లో కాల్చి చంపాడు. ఆ వెంటనే బ్రిటీష్​ ప్రభుత్వం ఉద్దమ్​ను అరెస్టు చేసి 1940 జులై 31న ఉరితీసింది. ఇదే కథతో సినిమాను తీర్చిదిద్దనున్నారు. వచ్చే ఏడాది అక్టోబరు 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details