ఐరన్‌మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. జవహార్‌లాల్ నెహ్రూ కోసం దేశానికి తొలి ప్రధానమంత్రి పదవిని పటేల్ త్యాగం చేశారని ఆమె కొనియాడారు.
"పటేల్ నిజమైన ఉక్కు మనిషి. మానసికంగా బలహీనులైన నెహ్రూను గాంధీ కావాలనే ఆ పదవికి ఎంచుకున్నారు. ఎందుకంటే నెహ్రూను ముందుంచి గాంధీ తనకు నచ్చినట్టు కథను నడింపించేందుకు ఇలా చేసుండొచ్చని నేను నమ్ముతున్నా. అయితే గాంధీ మరణించిన తర్వాత దేశ పరిస్థితి ఘోరంగా తయారయింది. అఖండ భారతదేశాన్ని ప్రజలకిచ్చి నాయకత్వాన్ని, ప్రధానమంత్రి పదవిని త్యాగం చేశారు పటేల్. మీ నిర్ణయానికి మేము చింతిస్తున్నాం. తొలి ప్రధానిగా అవ్వాల్సిన పటేల్.. నెహ్రూ ఇంగ్లీష్ బాగా మాట్లాడతారనే కారణంగా గాంధీపై విధేయతతో ఆ పదవిని త్యాగం చేశారు. ఈ చర్యతో వల్లభాయ్ పటేల్‌కు ఎలాంటి నష్టం జరగలేదు. కానీ, కొన్ని దశాబ్దాలుగా మన దేశ ప్రజలు కష్టాలు పడుతున్నారు".