తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బీటెక్​ కూడా అయిపోతోంది.. RRR మాత్రం రిలీజ్ కాలేదు' - RRR postponed

'ఆర్ఆర్ఆర్' సినిమా నాలుగేళ్లు గడిచింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్​ ట్వీట్ చేయగా, దానికి చిత్రబృందం ఆసక్తికరంగా రీట్వీట్ చేసింది.

RRR release date
ఆర్ఆర్ఆర్

By

Published : Nov 19, 2021, 1:56 PM IST

స్టార్ దర్శకుడు రాజమౌళి (Rajamouli) ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి కొన్నిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమా కోసం 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌ కొన్నేళ్ల నుంచి శ్రమిస్తోంది. సుమారు మూడేళ్ల క్రితం 2018 నవంబరు 18న 'ఆర్‌ఆర్‌ఆర్‌' షూట్‌ ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అప్పట్లో చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఓ ఫొటో షేర్‌ చేసింది. ఇప్పుడు ఆ ఫొటోను రీట్వీట్‌ చేసిన ఓ నెటిజన్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' రిలీజ్‌పై వ్యంగ్యంగా స్పందించాడు.

"డిప్లొమాలో ఉన్నప్పుడు మీరు సినిమా షూట్‌ ప్రారంభించారు. నా బీటెక్‌ కూడా అయిపోతుంది. మూవీ మాత్రం ఇంకా రిలీజ్‌ కాలేదు" అని ఒక నెటిజన్‌ ట్వీట్‌ చేయగా.. 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌ ఒకే ఒక్క మాటతో సమాధానమిచ్చేసింది. "ఏం చేద్దాం మరి.. నువ్వు కాలేజీకి వెళ్లనన్ని రోజులు మేము కూడా షూటింగ్‌ చేయలేదు" అంటూ కరోనా కారణంగా షూటింగ్‌ ఆలస్యమైన విషయాన్ని చెప్పకనే చెప్పింది.

రామ్‌చరణ్‌-తారక్‌ మల్టీస్టారర్‌గా ఈ సినిమా సిద్ధమైంది. ఇందులో చరణ్‌ (Ramcharan) అల్లూరి సీతారామరాజుగా.. తారక్‌ (NTR) కొమురంభీమ్‌గా కనిపించనున్నారు. చెర్రీకి జోడీగా ఆలియాభట్‌ (Alibhatt).. ఎన్టీఆర్‌కు జంటగా ఒలీవియా మోరీస్‌ నటిస్తున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. సుమారు రూ.450 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించినట్లు సమాచారం. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details