'లవ్‌స్టోరి' సినిమా నుంచి కొన్నిరోజుల క్రితం విడుదలైన 'సారంగదరియా' పాట యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ పాటకు యూట్యూబ్‌లో ఇప్పటివరకు 200 మిలియన్లకు పైగా వీక్షణలు దక్కాయి. దీంతో దక్షిణాదిలో అతి తక్కువ సమయంలో 200 మిలియన్ వ్యూస్ సాధించిన పాటగా 'సారంగదరియా' రికార్డు నెలకొల్పింది.
'సారంగదరియా'కు మరో రికార్డు దాసోహం! - naga chaitanya sai pallavi
'సారంగదరియా' లిరికల్ వీడియో యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అతితక్కువ సమయంలోనే 200 మిలియన్ వ్యూస్ దక్కించుకున్న తొలి దక్షిణాది పాటగా సరికొత్త రికార్డు నెలకొల్పింది.
!['సారంగదరియా'కు మరో రికార్డు దాసోహం! Saranga Dariya Song hits 200 million views in Youtube](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11882402-797-11882402-1621864257394.jpg)
'సారంగదరియా' క్రేజ్ మామూలుగా లేదుగా!
ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రచించగా.. పవన్ సీహెచ్ స్వరాలు సమకూర్చారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించారు. ఏప్రిల్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురావాల్సింది. కానీ, కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది.
ఇదీ చూడండి..'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసింది
Last Updated : May 24, 2021, 7:56 PM IST