*నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్‌స్టోరి'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ శిష్యుడు పవన్ సిహెచ్ సంగీతమందించారు. విడుదల సన్నాహాల్లో భాగంగా ఒక్కో పాటను విడుదల చేస్తున్న చిత్రబృందం.. సమంత చేతుల మీదుగా 'సారంగధరియా' పాటను ఆదివారం(ఫిబ్రవరి 28) రిలీజ్ చేయనున్నారు. 'ఫిదా'లో 'వచ్చిండే' పాటను రచించిన సుద్దాల అశోక్ తేజానే దీనిని కూడా రాస్తుండటం విశేషం. ఏప్రిల్ 16న సినిమా థియేటర్లలోకి రానుంది.
'లవ్‌స్టోరి' మరో పాట.. 'తెల్లవారితే గురువారం' టీజర్ - మూవీ లేటేస్ట్ న్యూస్
'లవ్‌స్టోరి' సినిమాలో ఫోక్ గీతాన్ని ఆదివారం ఉదయం రిలీజ్ చేయనున్నారు. శుక్రవారం విడుదలైన 'తెల్లవారితే గురువారం' టీజర్ ప్రేక్షకుల్ని అలరిస్తూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.
'లవ్‌స్టోరి' మరో పాట.. 'తెల్లవారితే గురువారం' టీజర్
*శ్రీసింహా, చిత్ర శుక్లా జంటగా మిషా నారంగ్ తెలుగు తెరకు పరిచయమవుతున్న చిత్రం 'తెల్లవారితే గురువారం'. మణికాంత్ దర్శకుడు. వారాహి చలన చిత్ర పతాకంపై రజినీ కొర్రపాటి నిర్మించారు. శుక్రవారం విడుదల టీజర్లో శ్రీసింహా పలికిన సంభాషణలు అలరిస్తున్నాయి. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దీనిని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మార్చి 27న సినిమా విడుదల కానుంది.