తెలంగాణ

telangana

ETV Bharat / sitara

భారీ నుంచి బార్బీ బొమ్మలా...

బాలీవుడ్‌ తెరపై అడుగుపెడుతూనే ‘కేదార్‌ నాథ్‌’, ‘సింబా’ వంటి బ్లాక్‌బాస్టర్లను ఖాతాలో వేసుకున్న అందాల భామ సారా అలీ ఖాన్‌.  తండ్రి సైఫ్‌ అలీ ఖాన్‌ నట వారసురాలిగా వెండితెరపై అభినయంతో మెరిసినా...ఆమె అరంగేట్రం వెనుక ఓ అపురూప కథ దాగుంది.

భారీ నుంచి బార్బీ బొమ్మలా...

By

Published : Apr 21, 2019, 10:53 PM IST

సారా అలీఖాన్​.. ఈ అందాల తార సొగసులకు, అభినయానికి ఫిదా అవ్వని సినీప్రియులు ఉండరు. అయితే ఇప్పుడు చూస్తున్న సారా రూపం వెనుక ఎంతో క్రమశిక్షణతో కూడిన కష్టం, ఓర్పు ఉన్నాయి.

రూపు కోసం ఎంతో శ్రమ...

ఒకప్పుడు పీసీఓడీ (పొలిసైటిక్‌ ఓవరీ సిండ్రోమ్‌)తో బాధపడేది సారా. దీని వల్ల ఆమె భారీకాయంతో బాధపడేదట. శరీరంలోని హార్మోన్ల అసమతుల్యత వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. అయితే ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడటానికి ఆమె ఎంతో కష్టపడింది. కఠినమైన ఆహార నియమాలు, కసరత్తులు చేసింది. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. అమెరికాలో డిగ్రీ చివరి సంవత్సరం చేస్తున్నప్పటి నుంచి బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించి చివరికి ఈ సుందర రూపంలోకి మారింది.

"మొదటి నుంచి నేను ఆత్మవిశ్వాసంతో ఉండేదాన్ని. కానీ అధిక బరువు వల్ల ఎవరైనా ఎగతాళి చేస్తారేమోనని భయపడేదాన్ని. అందుకే ఎలాగైనా బరువు తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నా. మొదట తినే ఆహారంలో మార్పులు చేశా. పిజ్జాలు, చాక్లెట్లకు బదులు ప్రోటీన్‌ షేక్, సల్లాడ్లు తీసుకున్నా. అత్యంత కఠినమైన కసరత్తులు చేసేదాన్ని. క్రమంగా పీసీఓడీ నుంచి బయటపడి ప్రస్తుత రూపాన్ని సాధించుకోగలిగా"

-సారా అలీఖాన్​, బాలీవుడ్​ నటి

వారసత్వ నీడ నుంచే తెరపైకి వచ్చినా.. స్టార్‌ నాయికగా మారడానికి ఎంతో కష్టపడుతున్నానని తొలి అడుగుల్లోనే చూపించేసింది సారా.

ABOUT THE AUTHOR

...view details