తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విజయ్​ దేవరకొండతో సారా 'ఫ్యాన్ మూమెంట్' - అత్రాంగీ రే

టాలీవుడ్ రైజింగ్ స్టార్ విజయ్​ దేవరకొండకు అమ్మాయిల్లో చాలా ఫాలోయింగ్ ఉంటుంది. హీరోయిన్​లు కూడా ఈ రౌడీ హీరో అంటే పడిచచ్చిపోతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో చేరిపోయింది బాలీవుడ్ నటి సారా అలీఖాన్.

Sara Ali Khan's 'fan moment' with Vijay Deverakonda
విజయ్​తో బాలీవుడ్ హీరోయిన్ 'ఫ్యాన్ మూమెంట్'

By

Published : Feb 14, 2021, 3:24 PM IST

నటుడు విజయ్​ దేవరకొండతో తన ఫ్యాన్​ మూమెంట్​ను ఆస్వాదించింది బాలీవుడ్ తార సారా అలీఖాన్. విజయ్​ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. అతడిపై ఉన్న అభిమానాన్ని ఇన్​స్టా​ వేదికగా పంచుకుంది సారా. విజయ్​తో దిగిన ఫొటోను షేర్​ చేసింది.

బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్​ ఇచ్చిన పార్టీలో వీరిద్దరూ కలుసుకున్నారు. ఆ విందుకు వారితో పాటు దీపికా పదుకొణె, ఇషాన్ కట్టర్, అనన్య పాండే, సిద్ధంత్ చతుర్వేది హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్​ను కలిసిన ఆనందంలో తాను అతడికి అభిమానినని సారా పేర్కొంది.

విజయ్​తో సారా

విజయ్​ ప్రస్తుతం 'లైగర్​' చిత్రంతో బిజిగా ఉన్నాడు. అందులో అనన్య పాండే హీరోయిన్. సారా 'అత్రాంగీ రే'లో నటిస్తోంది. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, ధనుష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి:టాలీవుడ్​ సెలబ్రిటీలు.. తొలి 'ప్రేమ' అనుభూతులు

ABOUT THE AUTHOR

...view details