బాలీవుడ్లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇటీవలే అమితాబ్, అనుపమ్ ఖేర్‌ల కుటుంబం ఈ వైరస్ బారిన పడగా.. ఇప్పుడు హీరోయిన్ సారా అలీ ఖాన్ డ్రైవర్‌కు కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం అతడు క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపింది. అయితే వైద్య పరీక్షల్లో తన కుటుంబానికి మాత్రం నెగిటివ్ వచ్చినట్లు వెల్లడించింది.
ఈ మధ్యే అమితాబ్‌తో పాటు ఆయన కుటుంబంలోని అభిషేక్, ఐశ్వర్యా రాయ్, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో బిగ్‌బీ ఇంటిని సీల్ చేయడం సహా ఆయన నివసిస్తున్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించింది ముంబయి మున్సిపల్ కార్పొరేషన్.