ఖాన్ల కుటుంబం నుంచి వచ్చినా తను, అందరిలాంటి అమ్మాయినే అని అంటోంది బాలీవుడ్ నటి సారా అలీఖాన్. ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో అందుకు సంబంధించిన విశేషాలను పంచుకుంది. చిన్నతనంలో చేసిన అల్లరి పనుల గురించి చెప్పింది.
నాలో ఏ ప్రత్యేకతలు లేవు: హీరోయిన్ సారా అలీఖాన్
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హీరోయిన్ సారా అలీఖాన్.. తనూ అందరిలాంటి అమ్మాయినేనని, ఏ ప్రత్యేకతలు లేవని చెప్పింది.
"నేను పెద్ద స్టార్ల కుటుంబం నుంచి వచ్చాననే అనుకోను. నన్ను నేనుగా బాలీవుడ్‌కే మహారాణిని అనుకోవాల్సిన అవసరం లేదు. నా గురించి అడిగితే నేను సైఫ్ అలీఖాన్, అమృతా సింగ్‌ల బిడ్డనే తప్ప, ఏ ప్రత్యేకతలు లేవు. బడిలో చదువుకునేప్పుడు చాలా అల్లరి అమ్మాయిని. ఓసారి పాఠశాల గదిలోని ఫ్యాను రెక్కలపై జిగురు ఉంచి స్విచ్చ్ వేశా. అంతే! ఆ జిగురంతా తరగతి గది అంతటా పడింది. అప్పుడు నన్ను ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు. 'ఎందుకు ఆ పని చేశావు?' అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. కరీనా కపూర్ అంటే చాలా ఇష్టం. ఆమె వృత్తికి ఇచ్చే ప్రాధాన్యం ఎంతో నచ్చింది. ఆమె పని తీరు చూసి, ఎంతో నేర్చుకోవాల్సిన అవసరముంది" -సారా అలీఖాన్, బాలీవుడ్ హీరోయిన్
2018లో 'కేథర్నాథ్' సినిమాతో వెండితెరకు పరిచయమైన సారా.. ఆ తర్వాత 'సింబా', 'లవ్ ఆజ్ కల్'తో ప్రేక్షకుల్ని అలరించింది. ప్రస్తుతం 'అతిరంగి రే', 'కూలీ నం.1' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.