తెలంగాణ

telangana

ETV Bharat / sitara

స్టార్​ కుటుంబమే అయినా.. 'స్టార్​డమ్​' నమ్మనంటోంది! - సైఫ్​ అలీఖాన్

స్టార్​డమ్​పై తనకు విశ్వాసం లేదంటోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ సారా అలీఖాన్. అగ్రతారల కుటుంబం నుంచి వచ్చిన ఈ చిన్నది.. పెద్ద హీరోలతో కలిసి నటించడం తన అదృష్టమని చెబుతోంది.

Sara Ali Khan: I don't look at stardom
స్టార్​ కుటుంబం నుంచి వచ్చింది.. 'స్టార్​డమ్​' నమ్మనంటోంది

By

Published : Dec 27, 2020, 8:27 PM IST

బాలీవుడ్ స్టార్​ సైఫ్​ అలీఖాన్​, అమృతా సింగ్​ల కుమార్తె నటి, సారా అలీఖాన్​.. స్టార్​డమ్​పై నమ్మకం లేదని చెబుతోంది. సినిమాల్లోకి రాకముందు నుంచీ కుటుంబ నేపథ్యం కారణంగా ప్రేక్షకుల కంట్లో పడిందీ చిన్నది. రెండేళ్ల క్రితం వచ్చిన తొలి చిత్రం నుంచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు, అభిమానులను సంపాదించుకున్న సారా.. అవేవీ ముఖ్యం కాదని చెబుతోంది.

"నాకు స్టార్​డమ్​తో పనిలేదు. ఇప్పటివరకు అభిమానులు, స్టార్​ అనే పదాలు నేను వాడలేదు. అలాంటి వాటిపై నాకు నమ్మకం లేదు. వారం వారం రిలీజయ్యే సినిమాలతో స్థాయి, స్టార్​డమ్​.. మారుతూ ఉంటాయి. అన్నింటికన్నా మన ఉద్దేశం చాలా ముఖ్యం. కృషి, పట్టుదల, పనిపట్ల పిచ్చి ప్రేమ ప్రాధానం. మిగిలినవన్నీ మారుతూ ఉంటాయి."

-సారా అలీఖాన్, బాలీవుడ్ నటి

నటి షర్మిళా ఠాగూర్​, భారత క్రికెట్​ మాజీ కెప్టెన్​ మన్సూర్​ అలీఖాన్​ పటౌడీల మనవరాలే సారా. 2018లో దివంగత సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ నటించిన 'కేదార్​నాథ్' చిత్రంతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత రణ్​వీర్​ సింగ్​, కార్తిక్​ ఆర్యన్, వరుణ్ ధావన్​ లాంటి నటులతో కలిసి పనిచేసింది. నచ్చిన వృత్తిలో కొనసాగడం కన్నా వేరే అదృష్టం లేదంటోందీ భామ.

సారా అలీఖాన్

"నాకు నచ్చిన వృత్తిలో కొనసాగడం అదృష్టంగా భావిస్తున్నా. 9 నుంచి 5 గంటల వరకు చేసే ఇష్టం లేని ఉద్యోగాలతో నా స్నేహితులు విసిగిపోయారు. కానీ, నా వరకు సినిమా ఉద్యోగం కాదు. నా జీవితంలో అదొక ఉత్సాహవంతమైన భాగం. ఇలాంటి జీవితం దక్కడం నా భాగ్యం."

-సారా అలీఖాన్, బాలీవుడ్ నటి

ప్రస్తుతం ఆనంద్​ ఎల్. రాయ్ దర్శకత్వంలో 'అత్రాంగిరే' చిత్రంలో నటిస్తోంది సారా. ఇందులో అక్షయ్​కుమార్ హీరో. వరుణ్​ ధావన్​తో చేసిన 'కూలీ నెం.1' డిసెంబర్​ 25న క్రిస్మస్​ సందర్భంగా విడుదలైంది.

ఇదీ చూడండి:మాళవిక హాట్​ ఫోజులు.. అభిమానులు ఫిదా

ABOUT THE AUTHOR

...view details