తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నాకు కాబోయే భర్త ఇల్లరికం రావాల్సిందే' - sara ali khan and dhanush

తల్లి అమృతనే తనకు సర్వస్వమని చెప్పారు బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్. ఆమెను వదిలి ఉండటం తన వల్ల కాదని, తనకు కాబోయేవాడు ఇల్లరికం రాక తప్పదని చెప్పారు.

Sara Ali khan
సారా అలీఖాన్

By

Published : Jan 3, 2022, 6:30 PM IST

బాలీవుడ్ నటి సారా అలీఖాన్‌ .. 'కేదార్‌నాథ్‌'తో నటిగా తెరంగేట్రం చేసిన ఆమె 'లవ్‌ ఆజ్‌కల్‌', 'కూలీ నం:1', 'అత్రాంగి రే' చిత్రాల్లో నటించారు. ఇటీవల విడుదలైన 'అత్రాంగి రే'లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సారా వివాహితగా కనిపించారు. ఇటీవలే ఈ సినిమా సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్న సారా.. తనకు కాబోయే భర్తపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సారా అలీఖాన్

"నాకు అమ్మే సర్వస్వం. ఆమెతో ఉంటే సంతోషంగా ఉంటా. ఆమె నాకు ఓ ఇల్లు లాంటిది. పనుల నిమిత్తం ఎక్కడికి వెళ్లినా చివరికి తిరిగి ఇంటికి ఎలా చేరుకుంటామో అదే మాదిరిగా ఎన్ని పనుల్లో బిజీగా ఉన్న అమ్మతోనే సమయాన్ని గడపటానికి ఇష్టపడుతుంటా. అలాగే కొన్ని విషయాల్లో నాకు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం రాదు. ఇప్పటికీ నేను బయటకు వస్తే ఎలా రెడీ అవ్వాలో అమ్మే చెబుతుంటుంది. మా ఇద్దరి మధ్య అంత మంచి అనుబంధం ఉంది. ఆమెను వదిలి ఉండటం నా వల్ల కాదు. కనుక భవిష్యత్తులో నన్ను పెళ్లి చేసుకునే వ్యక్తి ఇల్లరికం వచ్చేందుకు ఒప్పుకోవాల్సి ఉంటుంది."

-సారా అలీఖాన్, నటి

తల్లితో సారా

బాలీవుడ్​ స్టార్​ నటుడు సైఫ్​ అలీఖాన్​ మొదటి భార్య అమృతా సింగ్​. వీరికి సారా, ఇబ్రహీం అలీఖాన్​ సంతానం. అనంతరం అమృతా సింగ్​తో విడిపోయిన సైఫ్​.. స్టార్​ హీరోయిన్​ కరీనా కపూర్​ను రెండో పెళ్లి చేసుకున్నారు​. వీరికి ఇద్దరు మగపిల్లలు.

సారా

ఇక, 'అత్రాంగి రే' చూసి తన తల్లిదండ్రులు సైఫ్‌, అమృతా కన్నీళ్లు పెట్టుకున్నారని సారా తెలిపారు. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, ధనుష్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఇదీ చూడండి:విజయ్​దేవరకొండ చాలా హాట్​: సారా అలీఖాన్

ABOUT THE AUTHOR

...view details