'దంగల్' సినిమాతో గుర్తింపు తెచ్చుకుని.. హీరోయిన్గా పలు సినిమాలు చేస్తున్న బ్యూటీ సన్యా మల్హోత్రా. గత నాలుగేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్న ఈమెకు గతేడాది బ్రేకప్ అయింది. ఇటీవల ఓ ఇంటర్వూలో ఈ విషయం గురించి చెప్పిన సన్య.. బ్రేకప్ తనను చాలా బాధపెట్టిందని తెలిపింది.
"నాలుగేళ్ల క్రితం నేను దిల్లీలో ఉన్నప్పుడు రిలేషన్షిప్ ప్రారంభమైంది. గతేడాది బ్రేకప్ అయింది. అలానే గతేడాది లాక్డౌన్ వల్ల ముంబయిలో నేను ఒక్కదాన్నే ఉన్నాను. మనల్ని కాదనుకున్న వారి గురించి మనం ఆలోచించకూడదని అనుకున్నాను. అందుకే పనిపై పూర్తిగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను" అని సన్య చెప్పింది. అలానే తన రిలేషన్‌షిప్‌పై ఎలాంటి ఫిర్యాదులు లేవని కూడా తెలిపింది.