'ఏక్ మినీ కథ' సినిమాలో నటించే అవకాశం రావడం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని హీరో సంతోష్ శోభన్ అన్నాడు. ఇలాంటి చిత్రాలు చేసే అవకాశం చాలా అరుదుగా వస్తుంటుందని చెప్పాడు. బోల్డ్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా.. మే 27న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైంది.
"నాలాంటి నటులకు, ఇతర దర్శకులకు గానీ కొన్ని అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి సినిమానే 'ఏక్ మినీ కథ'. ఇందులో చేయడం జీవితాంతం గుర్తుండిపోయే విషయం. గాంధీసర్ ఈ కథ రాసిన తర్వాత, ఇలాంటి కథతో ఏమైనా సినిమాలు వచ్చాయా అని మేం వెతికాం కానీ ఎక్కడా దొరకలేదు. దీనికి వచ్చిన క్రెడిట్ అంతా ఆయనదే" అని సంతోష్ శోభన్ చెప్పాడు.