'కందిరీగ', 'హైపర్', 'రభస' చిత్రాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. నాలుగేళ్ల విరామం తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో 'అల్లుడు అదుర్స్' సినిమా తీశారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన సంతోష్ శ్రీనివాస్.. తన చిత్రం ఇంటిల్లిపాదిని అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
'పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని ఉంది'
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అల్లుడు అదుర్స్'. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈటీవీ భారత్‌తో ముచ్చటించిన దర్శకుడు సంతోష్ పలు విషయాలను పంచుకున్నారు.
'అల్లుడు అదుర్స్' సినిమా చిత్రీకరణ సమయంలో ఎన్నో అద్భుతాలు చోటుచేసుకున్నాయన్న సంతోష్.. కరోనా వల్ల సంక్రాంతికి తమ సినిమా రావడం సంతోషంగా ఉందని వెల్లడించారు. సోనూసూద్ తనకు పదేళ్లుగా తెలుసని 'కందీరీగ' సమయంలో సోనూకి ప్రస్తుత సోనూకి చాలా తేడా ఉందని తెలిపారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు సోనూ స్థానం మరింత పెరిగిందని పేర్కొన్నారు. ఓటీటీల హవా కొనసాగుతున్నా.. థియేటర్‌కు ప్రేక్షకులు కచ్చితంగా వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. చివరగా పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా తెరకెక్కించాలని ఉందని తన మనసులోని మాట బయటపెట్టారు.