సంక్రాంతి వస్తోందంటే చాలు... అభిమాన కథానాయకుడి సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు ప్రేక్షకులు. తొలి రోజు తొలి ఆటతోనే సినిమాల్ని ఆస్వాదించేందుకు సిద్ధమైపోతుంటారు. పండగ చిత్రాలంటే అందులో ప్రత్యేకమైన అంశాలు పుష్కలంగానే ఉంటాయి. ప్రతిఏటా లాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి లక్ష్యంగా చాలా సినిమాలే సిద్ధమయ్యాయి. సరిగ్గా ఐదారు నెలల క్రితం.. ముగ్గుల పండగ రేసులో ఉన్న చిత్రాల జాబితాను చూసి థియేటర్లు దద్దరల్లిపోతాయని అందరూ అనుకున్నారు. కానీ, కరోనా మహమ్మారి ప్రేక్షకుల ఆశలపై నీరు చల్లింది. ఒక్కో సినిమా వెనక్కి వెళ్లిపోయింది. ఆఖరి నిమిషంలో 'ఆర్‌ఆర్‌ఆర్' విడుదలను కూడా వాయిదా వేయడం వల్ల తెలుగు సినీ ప్రేక్షకులకు కాస్త నిరాశే మిగిలింది. అయితే, 'మేమున్నాం బాసూ' అంటూ పలు చిన్న చిత్రాలు వరుసగా ఈ ముగ్గుల పండగ సీజన్ రేసులోకి క్యూ కట్టాయి. అవేంటో చూసేయండి.
సోగ్గాడిగా 'బంగార్రాజు'
Nagarjuna Bangarraju movie release date: నాగార్జున కథానాయకుడిగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయన' ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రమే 'బంగార్రాజు'. తండ్రి నాగార్జునతో కలిసి ఇందులో నాగచైతన్య సందడి చేస్తున్నారు. కృతిశెట్టి కథానాయిక. సినిమా విడుదలపై చివరి వరకూ ఉత్కంఠ నెలకొనగా ఎట్టకేలకు జనవరి 14న 'బంగార్రాజును' విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. మరి తండ్రీకొడుకులు ప్రేక్షకులను ఎలా అలరిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే!
థియేటర్లలో 'సూపర్ మచ్చి'
Supermachi movie release date: చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'సూపర్‌మచ్చి'. పులి వాసు దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మితమైంది. రియా చక్రవర్తి, రుచితా రామ్ కథానాయికలుగా నటించారు. రొమాంటిక్ కామెడీ రూపొందిన ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా/లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రం సంక్రాంతి రేసులో నిలిచింది. జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
కాలేజీ ప్రేమలు.. విద్యార్థుల గొడవలు
Rowdy movie release date: ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ జంటగా హర్ష కొనుగంటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శశిదేవ్ విక్రమ్, కార్తిక్ రత్నం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాలేజీ ప్రేమలు.. ఆ ప్రేమ కోసం విద్యార్థుల మధ్య జరిగే కొట్లాటలు తదితర అంశాల నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
'హీరో'గా మహేశ్‌బాబు మేనల్లుడు
Hero movie release date: మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా పరిచయమవుతున్న 'హీరో' సంక్రాంతి సందర్భంగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయిక. ఫుల్‌లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతోంది.
ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు/వెబ్ సిరీస్‌లు ఇవే!
అమెరికాలో ప్రిన్స్ కష్టాలు..
యువ నటుడు ప్రిన్స్ కీలకపాత్రలో నటించిన చిత్రం ‘ది అమెరికన్ డ్రీమ్’. డబ్బు సంపాదించటం కోసం అమెరికాలో ఎదురయ్యే కష్టాల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నట్టు ప్రచార చిత్రాలు చూస్తే తెలుస్తోంది. విఘ్నేశ్ కౌశిక్ దర్శకత్వం వహించారు. నేహా కథానాయిక. ఈ చిత్రం జనవరి 14 నుంచి ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్