యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్.. త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడా? అంటే అవుననే అంటున్నాయి సినీవర్గాలు. ప్రముఖ హిందీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించనున్నారట. ఇందులో తారక్‌తోపాటు స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించనున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ డైరెక్టర్.. ఇద్దరు కథానాయకులతో చర్చలు జరిపారని, త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయని టాక్.
బాలీవుడ్ దర్శకుడితో తారక్ పీరియాడికల్ సినిమా! - బాలీవుడ్ స్టార్ దర్శకుడుతో ఎన్టీఆర్ సినిమా!
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తర్వాత చిత్రంలో జూ.ఎన్టీఆర్ నటించనున్నాడనే వార్త.. ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇందులో తారక్ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.
బాలీవుడ్ స్టార్ దర్శకుడుతో ఎన్టీఆర్ సినిమా!
జూ.ఎన్టీఆర్.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్'లో ప్రస్తుతం నటిస్తున్నాడు. అనంతరం త్రివిక్రమ్‌తో కలిసి పనిచేయనున్నాడు. ఈ రెండూ పూర్తయిన తర్వాతే సంజయ్ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది.
'పద్మావత్', 'భాజీరావ్ మస్తానీ', 'దేవదాస్', 'రామ్ లీలా' వంటి చారిత్రక సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ.