గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లనున్నారు.
"వైద్య చికిత్స కోసం వృత్తిపరమైన ఒప్పందాల నుంచి స్వల్ప విరామం తీసుకుంటున్నా. నా కుటుంబసభ్యులు, స్నేహితులు నాతోనే ఉన్నారు. అనవసర ప్రచారాలు చేయవద్దని నా శ్రేయాభిలాషులను కోరుతున్నా. మీ ప్రేమ, శుభాకాంక్షలతో నేను త్వరలోనే తిరిగి వస్తా"