తెలంగాణ

telangana

ETV Bharat / sitara

స్మాల్​ బ్రేక్​.. త్వరలోనే తిరిగి వస్తా: సంజయ్​ - సినిమాలకు తాత్కాలిక విరామం సంజయ్​ దత్​

వృత్తిపరమైన ఒప్పందాలకు స్వల్ప విరామాన్ని ఇస్తున్నట్లు తెలిపాడు బాలీవుడ్​ నటుడు సంజయ్​ దత్​. వైద్య చికిత్స కోసం కొంత సమయాన్ని వెచ్చిస్తున్నట్లు తాజాగా వెల్లడించాడు.

Sanjay Dutt takes break from work for medical treatment, asks fans to not speculate
'స్మాల్​ బ్రేక్​.. త్వరలోనే మళ్లీ తిరిగి వస్తా'

By

Published : Aug 11, 2020, 9:36 PM IST

ప్రస్తుతం తన ఆరోగ్యంపై దృష్టి సారించడానికి వృత్తిపరమైన ఒప్పందాలకు తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు మంగళవారం వెల్లడించాడు బాలీవుడ్​ నటుడు సంజయ్​ దత్​. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించాడు.

"వైద్య చికిత్స కోసం వృత్తిపరమైన ఒప్పందాల నుంచి స్వల్ప విరామం తీసుకుంటున్నా. నా కుటుంబసభ్యులు, స్నేహితులు నాతోనే ఉన్నారు. అనవసర ప్రచారాలు చేయవద్దని నా శ్రేయాభిలాషులను కోరుతున్నా. మీ ప్రేమ, శుభాకాంక్షలతో నేను త్వరలోనే తిరిగి వస్తా".

-సంజయ్​ దత్​, బాలీవుడ్​ నటుడు

గతవారం శ్వాస సంబంధిత సమస్య రావడం వల్ల ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చేరాడు సంజయ్​ దత్​. కరోనా అనుమానంతో పరీక్ష చేయగా అందులో నెగటివ్​గా నిర్థరణ అయ్యింది. ఆస్పత్రిలో రెండు రోజుల వైద్య పర్యవేక్షణ తర్వాత సోమవారం డిశ్చార్జ్​ అయ్యాడు సంజయ్​.

సంజయ్​ దత్​ నటించిన 'సడక్​ 2', 'భుజ్: ది ప్రైడ్​ ఆఫ్​ ఇండియా​' ఓటీటీలో విడుదలకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం 'కేజీఎఫ్​ 2', 'షంషెరా' చిత్రాల్లో నటిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details