హిందీ నటుడు సంజయ్‌దత్ ఆరోగ్యంపై ఆయన భార్య మానయతాదత్ ఓ అధికారిక ప్రకటన చేశారు. ఆయన ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతన్నట్లు స్పష్టం చేశారు. ఇటీవలె ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో సంజయ్‌కు ప్రాథమిక చికిత్స జరిగిందని తెలిపారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత చికిత్స కోసం విదేశాలకు వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మానయతా స్పష్టం చేశారు.
"సంజు అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ.. మీరు ఇన్నేళ్లుగా ఆయనపై చూపించిన ప్రేమకు కేవలం ధన్యవాదాలతో సరిపెట్టలేను. సంజు తన జీవితంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నాడు. కానీ, ప్రతి కఠినమైన దశలోనూ మీ మద్దతు, ప్రశంసలను మీరు ఎప్పుడూ కొనిసాగిస్తున్నారు. మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉంటాం. ప్రస్తుతం మరో సవాలు మనల్ని పరీక్షించనుంది. ఇప్పుడూ సంజుపై అలాంటి ప్రేమాభిమానులే మళ్లీ కావాలని కోరుకుంటున్నా. ఈ సమయంలో దురదృష్టవశాత్తు నేను ఇంట్లోనే నిర్బంధం అవ్వాల్సి వచ్చింది. కొన్ని రోజుల్లో క్వారంటైన్ ముగుస్తుంది. సంజు ఇటీవలె కోకిలాబెన్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్సను పూర్తి చేసుకున్నాడు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత చికిత్స కోసం మేము విదేశాలకు వెళ్లడానికి ప్రణాళిక చేసుకుంటాం. దీనిపై ఊహాగానాలను ప్రచారం చేయొద్దని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. సంజయ్ ఆరోగ్య సమాచారాన్ని క్రమం తప్పకుండా మీకు చేరవేస్తాను".