తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దుబాయ్​లో సంజయ్ దత్​​-మోహన్​లాల్​ దీపావళి సంబరాలు - sanjay dutt latest celebrations

ప్రముఖ నటుడు సంజయ్ దత్​, మలయాళ సూపర్​స్టార్​ మోహన్​లాల్​ కలిసి దుబాయ్​లో దీపావళి వేడుకలు చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

sanjay dutt news
దుబాయ్​లో సంజయ్ దత్​​-మోహన్​లాల్​ దీపావళి సంబరాలు

By

Published : Nov 15, 2020, 4:21 PM IST

బాలీవుడ్​ స్టార్​ హీరో సంజయ్​ దత్​.. క్యాన్సర్​ నుంచి కోలుకున్నాక కుటుంబంతో కలిసి దుబాయ్​లోనే ఉంటున్నారు. అయితే తాజాగా దీపావళి వేడుకలను అక్కడే నిర్వహించుకున్నారు. అయితే ఈ పండక్కి సంజయ్​దత్​ ఇంటికి ఓ అతిథి వచ్చారు. ఆయనెవరో కాదు మలయాళ సూపర్​స్టార్​ మోహన్​లాల్​. ఇటీవల ఐపీఎల్​ ఫైనల్​ మ్యాచ్​కు హాజరైన మోహన్​లాల్​.. ఇంకా ఆ దేశంలోనే ఉన్నారు. అయితే తాజాగా ​సంజూ కుటుంబంతో కలిసి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకోగా... ప్రస్తుతం అవి నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

మోహన్​లాల్,​ సంజయ్​దత్​
మోహన్​లాల్,​ సంజయ్​దత్​

చివరిగా 'సడక్ 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంజయ్.. 'కేజీఎఫ్ 2'లో అధీరా పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంతోనే కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

కుటుంబంతో సంజయ్​ దత్​

ABOUT THE AUTHOR

...view details