'బుజ్జిగాడు' హీరోయిన్ సంజనా.. కరోనా కష్టకాలంలో ఆకలితో అలమటిస్తున్న పేదలకు ఆహారం, శాండల్‌వుడ్ సినీ కార్మికుల కుటుంబాలకు తన ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది.
Sanjana: పేదలకు ఆహారం.. సినీ కార్మికులకు సాయం - sanjana galrani latest news
తెలుగు, కన్నడ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సంజనా గల్రానీ.. లాక్డౌన్ సమయంలో పేదలకు ఆహారం అందిస్తోంది. కన్నడ సినీ కార్మికుల 500 కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేసింది.
"ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌తో పాటుగా కొవిడ్ కట్టడిలో భాగస్వామ్యులైన అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను. మాస్కులు ధరించడం, ప్రతిరోజు శానిటైజ్ చేసుకోవడం, భౌతికదూరం పాటించడం..ఇలా కొవిడ్ నియంత్రణ చర్యలను పాటించడం వల్లనే ఈ ప్రపంచం కొవిడ్ మహమ్మారి నుంచి బయటపడుతుంది. సంజనా గల్రాని ఫౌండేషన్ ద్వారా పేదవాళ్లకు రెండు పూటలా ఆహారం అందిస్తున్నాను. 500 సినీ కార్మికుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించాను. భవిష్యత్‌లో కూడా ఇలాంటి సహాయాలను కొనసాగిస్తాను" అంటూ సంజన చెప్పింది.
ఇది చదవండి:BELLAMKONDA: వర్షం దెబ్బకు రూ.3 కోట్ల సెట్ డ్యామేజ్!