తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇజ్జూ.. నిన్ను తినేయాలని ఉంది: పరిణీతి - bollywood

సానియా మీర్జా కొడుకు ఇజాన్​తో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా కాసేపు ఆడుకుంది. ఇందుకు సంబంధించి ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టింది.

పరిణీతి చోప్రా

By

Published : Apr 2, 2019, 10:56 AM IST

చిన్న పిల్లలతో ఆడుకోవడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా కూడా ఓ బాబుతో సరదాగా గడిపింది. అతనెవరో కాదు ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తనయుడు ఇజాన్ మీర్జా మాలిక్.

"ఇజాన్​ని తినేయాలని ఉంది. కానీ నా చేతిని తినడానికి ఇజ్జుకి అనుమతి ఇచ్చా. సానియా ఇతడిని నేను ఎల్లప్పుడూ ఉంచుకోవచ్చా".. అంటూ ఇన్ స్టాలో రాసుకొచ్చింది పరిణీతి.

పరిణీతి ఒడిలో కూర్చుని.. ఆమె చేతిని తినడానికి ప్రయత్నిస్తున్న ఓ ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేసింది ఈ బాలీవుడ్ నటి.

ఇన్ స్టాలో పరిణీతి చోప్రా

ఇవీ చూడండి..'బాస్కెట్​బాల్'​లో ఈ రోబోతో పోటీ పడగలరా!

ABOUT THE AUTHOR

...view details