తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహేష్​ సినిమాలో 'ఖడ్గం' నటి..! - sangeetha

మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాలో 'ఖడ్గం' ఫేం సంగీత ఓ కీలకపాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్​ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంగీత

By

Published : Jul 24, 2019, 9:06 AM IST

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్​బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరూ.' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో 'ఖడ్గం' ఫేం సంగీత ఓ కీలకపాత్రలో నటించనుందని సమాచారం. ఆ పాత్రకు సంగీత అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోందట.

'ఖడ్గం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగీత ఆ తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు దక్కించుకుంది. వెంకటేశ్, బాలకృష్ణ వంటి స్టార్​ హీరోల సరసన నటించింది. ఆ తర్వాత ఎక్కువగా తమిళ చిత్రాలు చేసిన ఈ నటి 2009లో పెళ్లి చేసుకుని సినిమాలు చేయడం తగ్గించింది.

'సరిలేరు నీకెవ్వరూ'లో మహేష్ సరసన రష్మిక మందణ్మ హీరోయిన్​గా నటిస్తుండగా విజయ శాంతి, రాజేంద్రప్రసాద్ వంటి సీనియర్​ నటులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. దిల్​ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు.

ఇవీ చూడండి.. సప్తగిరి సినిమాల్లోకి ఎందుకు వచ్చాడో తెలుసా!

ABOUT THE AUTHOR

...view details