తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సందీప్‌ రణ్‌బీర్‌కు కథ చెప్పాడట..! - ranbeer kapoor

యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరో బాలీవుడ్ చిత్రం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందుకోసం యువ హీరో రణ్​బీర్ కపూర్​కు కథను వినిపించాడని సమాచారం.

రణ్​బీర్

By

Published : Sep 13, 2019, 7:13 PM IST

Updated : Sep 30, 2019, 12:01 PM IST

'కబీర్‌ సింగ్‌' హిట్‌తో బాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాడు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. హిందీలో తన తొలి చిత్రంతోనే దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రంతో హిందీ చిత్రసీమలో తనకు ఏర్పడిన క్రేజ్‌ను మరింత పెంచుకునేందుకు రెడీ అవుతున్నాడీ క్రేజీ డైరెక్టర్‌. ఇందుకు తగ్గట్లుగానే తన రెండవ చిత్రాన్ని హిందీలోనే ప్లాన్‌ చేసుకుంటున్నాడని సమాచారం.

తాజాగా ఈ యువ దర్శకుడు బాలీవుడ్ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ను కలిశాడంటూ ఓ వార్త ఉత్తరాది మీడియాలో చక్కర్లు కొడుతోంది. సందీప్ తర్వాతి సినిమా కోసమే రణ్‌బీర్‌ను కలిశాడని, అతడికి స్టోరీలైన్‌ వినిపించాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది కచ్చితంగా తెలియనప్పటికీ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కాలంటే వచ్చే ఏడాది చివరి వరకైనా వేచి చూడక తప్పదు. ఎందుకంటే ప్రస్తుతం రణ్‌బీర్‌ 'బ్రహ్మాస్త్ర' వంటి భారీ ప్రాజెక్టుతో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అవి పూర్తయితేనే సందీప్‌తో చేయడానికి రణ్‌బీర్‌కు వీలు కుదురుతుంది

ఇవీ చూడండి.. టీజర్: విశాల్ 'యాక్షన్'.. తమన్నా హై టెన్షన్

Last Updated : Sep 30, 2019, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details