'అర్జున్ రెడ్డి' చిత్రం విడుదలై రెండేళ్లు దాటింది. ఈ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తర్వాతి చిత్రం ఏంటా.. అని ప్రస్తుతం అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. వీటికి చెక్ పెడుతూ త్వరలోనే ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు సందీప్. టీ-సిరీస్ అధినేత భూషణ్‌కుమార్, మురాద్ ఖేతాని ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమా నిర్మాణంలో సందీప్ కూడా భాగస్వామి కానున్నాడు. అయితే చిత్రం హిందీలో తెరకెక్కుతుందా, తెలుగులోనూ వస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇందులో నటించబోయే నటీనటులను త్వరలో ప్రకటించనుంది చిత్రబృందం.