తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అర్జున్ రెడ్డి దర్శకుడికి అదిరే ఆఫర్..! - అర్జున్ రెడ్డి

'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగా..  సల్మాన్​ఖాన్ హీరోగా త్వరలో ఓ సినిమాను తెరకెక్కించనున్నాడని సమాచారం.

అర్జున్ రెడ్డి దర్శకుడికి అదిరే ఆఫర్..!

By

Published : Jun 30, 2019, 9:27 AM IST

తెలుగులో 'అర్జున్ రెడ్డి'.. హిందీలో 'కబీర్​ సింగ్'​ను తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. రెండు చోట్ల ఘనవిజయం సాధించింది ఈ సినిమా. ఈ కారణంగా సందీప్ బాలీవుడ్​ అగ్రకథానాయకుడు సల్మాన్​ ఖాన్​ను డైరక్ట్​ చేసే అవకాశం దక్కించుకున్నాడని వార్త వినిపిస్తోంది. త్వరలో ఈ సినిమా మొదలయ్యే ఛాన్సుంది.

త్వరలో సల్మాన్​ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్న సందీప్ రెడ్డి వంగా

ఇప్పటివరకు దక్షిణాదిలో విజయం సాధించిన చిత్రాలను హిందీలో రీమేక్‌ చేసేవాడు హీరో సల్మాన్​ఖాన్. కానీ ఇప్పుడు ఏకంగా ఓ తెలుగు దర్శకుడితో పనిచేయడానికి సిద్ధమయ్యాడనే వార్తను టాలీవుడ్​ గొప్పతనంగా భావించవచ్చు.

ఇది చదవండి: 'ముద్దు సన్నివేశాల్లో నటించడం చాలా తేలిక'​ అని అంటున్న కియారా అడ్వాణీ

ABOUT THE AUTHOR

...view details