తెలుగులో 'అర్జున్‌రెడ్డి', హిందీలో 'కబీర్ సింగ్' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అతడు మరోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఇప్పటికే కొడుకు అర్జున్ ఉండగా, సందీప్ భార్య మనీషా.. ఈరోజు పాపను ప్రసవించింది. ఈ విషయంపై పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
'అర్జున్‌రెడ్డి' దర్శకుడికి తండ్రిగా ప్రమోషన్ - movie news
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా భార్య మనీషా.. ఈరోజు పాపను ప్రసవించింది. ఈ దర్శకుడు 'అర్జున్‌రెడ్డి' సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నాడు.
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
ఈ డైరెక్టర్.. ప్రస్తుతం పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. డార్లింగ్ ప్రభాస్‌తో కలిసి పనిచేయనున్నాడంటూ గత కొద్దిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. వీటిలో నిజమెంతన్నది తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.
ఇది చదవండి:'అర్జున్‌రెడ్డి' డైరెక్టర్‌తో రెబల్‌స్టార్ ప్రభాస్!
Last Updated : Mar 2, 2020, 6:46 PM IST