తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తొలి హాకీ ప్లేయర్​గా సందీప్ కిషన్..! - sandeep kishan a1 express

తెలుగులో హాకీ నేపథ్యంలో రూపొందుతున్న తొలి చిత్రం 'ఏ1 ఎక్స్​ప్రెస్'. సోమవారం లాంఛనంగా చిత్రీకరణ ప్రారంభమైంది. సందీప్ కిషన్ కథానాయకుడు.

సందీప్ కిషన్

By

Published : Nov 4, 2019, 4:56 PM IST

టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే అతడు నటించిన తెనాలి రామకృష్ణ త్వరలో విడుదల కానుండగా.. మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు. హాకీ క్రీడల నేపథ్యంలో ఓ​ చిత్రాన్ని పట్టాలెక్కించాడు సందీప్. ఏ1 ఎక్స్​ప్రెస్​ టైటిల్​తో వస్తున్న ఈ సినిమాలో అతడు హాకీ ప్లేయర్​గా కనిపించనున్నాడు.

తొలి హాకీ ప్లేయర్​గా సందీప్ కిషన్

సోమవారం ఈ సినిమా చిత్రీకరణ లాంఛనంగా ప్రారంభమైంది. తెలుగులో హాకీ నేపథ్యంలో రాబోతున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. డెన్నిస్ జీవన్ ఈ సినిమాకు దర్శకుడు. హిప్​ హాప్ తమిజ సంగీతం సమరకూర్చనున్నాడు.

పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇదీ చదవండి: ఒకే సినిమాలో ఖాన్​ త్రయం.. అభిమానులకు పండగే.!

ABOUT THE AUTHOR

...view details