బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన సినీ నిర్మాత శంకర్‌గౌడ విషయమై టాలీవుడ్ హీరో తనీష్‌ను ఇటీవల అక్కడి పోలీసులు విచారించారు. ఈ విచారణ సమయంలో ఆయన కన్నీటి పర్యంతమైనట్లు తెలిపారు అధికారులు. ఈ కేసులో తనకెలాంటి సంబంధం లేదని ఆయన చెప్పినట్లు వెల్లడించారు.
"ఈ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నిర్మాత శంకర్ గౌడ నివాసంలో ఆయన ఇచ్చిన పార్టీకి ఒకసారి మాత్రమే హాజరయ్యా. నాకు మీరు నోటీసులు పంపించడం వల్ల నేను ఒప్పుకొన్న కొత్త సినిమాలు ఆగిపోయాయి. దయచేసి విచారణ పేరుతో మళ్లీ నన్ను పిలవొద్దు. శంకర గౌడ కన్నడలో సినిమాలు నిర్మిస్తారు. ఓసారి హైదరాబాద్‌లో కలిసి 'నీతో కన్నడలో సినిమా చేస్తా' అన్నారు. ఆయనతో టచ్‌లో ఉంటే నాకు అవకాశాలు వస్తాయని భావించాను. ఈ క్రమంలోనే బెంగళూరులోని ఆయన నివాసంలో కలిశాను. ఆయన ఇచ్చిన పార్టీకి ఓ సారి హాజరయ్యాను."