ప్రముఖ గాయని లతా మంగేష్కర్ 90వ పుట్టినరోజు సందర్భంగా.. ఆమెకు వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. పూరీ సముద్ర తీరాన తంబూరతో ఉన్న ఆమె ముఖచిత్రాన్ని ఇసుకలో రూపొందించారు.
సుమారు 7 టన్నుల ఇసుకను ఉపయోగించి, 5 అడుగుల పొడుగు, 20 అడుగుల వెడల్పుతో ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు సుదర్శన్. దేశంలో ఉన్న కోట్ల మందికి ఆమె స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. పూరీ జగన్నాథుని ఆశీస్సులు లతా మంగేష్కర్‌పై ఎల్లవేళలా ఉంటూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు.