ప్రముఖ గాయని, భారతరత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్ నేడు 91వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ శాండ్ ఆర్ట్ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ వినూత్న రీతిలో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఒడిశాలోని పూటా బీచ్లో అందమైన సైకత శిల్పాన్ని రూపొందించి ఆమెకు విషెస్ తెలిపారు.
సైకత శిల్పంతో గాన సరస్వతికి శుభాకాంక్షలు - లతా మంగేష్కర్ సైకత శిల్పం
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పుట్టినరోజు సందర్భంగా ఒడిశాలోని పూటా బీచ్లో ఆమె సైకత శిల్పాన్ని రూపొందించారు సుదర్శన్ పట్నాయక్. ఈ సైకత శిల్పం చూపరులను అమితంగా ఆకట్టుకుంటోంది.
సైకత శిల్పంతో గాన సరస్వతికి శుభాకాంక్షలు
భారతదేశ అత్యున్నత పురస్కారమైన 'భారతరత్న' అందుకున్న గానకోకిల లతా మంగేష్కర్. 36 దేశ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ గీతాలాపన చేసిన ఘనత ఆమెది. వెయ్యికి పైగా హిందీ సినిమాల్లో ఆమె ఆలపించిన గీతాలు.. శ్రోతల మనసుల్లో మాధుర్యాన్ని నింపుతూ ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు సహా మూడు జాతీయ అవార్డులే కాదు, లెక్కలేనన్ని పురస్కారాలు... వాటిని మించి అభిమానుల గుండెల్లో అత్యున్నత స్థానం ఆమె సొంతం.