తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ర‌వితేజ కోసం తమిళ దర్శక నటుడు.. - samudrakhani to act in raviteja film

మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రంలో తమిళ నటుడు సముద్రఖని ఓ కీలకపాత్ర చేయనున్నాడు.

రవితేజ

By

Published : Nov 7, 2019, 1:43 PM IST

Updated : Nov 7, 2019, 10:58 PM IST

త‌మిళ‌నాట ద‌ర్శ‌క న‌టుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు స‌ముద్ర‌ఖని. ఇప్పుడైతే కేవ‌లం న‌ట‌న‌పైనే దృష్టి పెట్టాడు. తాజాగా ఈ నటుడికి ర‌వితేజ సినిమాలో ఓ మంచి పాత్ర ద‌క్కింది.

ర‌వితేజ - శ్రుతిహాస‌న్ జంట‌గా ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో ఓ కీల‌క‌ పాత్ర కోసం స‌ముద్ర‌ఖ‌నిని ఎంచుకుంది చిత్రబృందం. ర‌వితేజ‌ హీరోగా వచ్చిన 'శంభో శివ శంభో' చిత్రానికి స‌ముద్ర‌ఖ‌నినే ద‌ర్శ‌కుడు.

ప్ర‌స్తుతం ర‌వితేజ 'డిస్కోరాజా'తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం డిసెంబ‌రులో విడుద‌ల కానుంది. ఆ త‌ర్వాత గోపీచంద్ మ‌లినేనితో సినిమా మొద‌ల‌వుతుంది. ఇందులో ర‌వితేజ ఓ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. `క్రాక్‌` అనే పేరు ప‌రిశీలిస్తున్నారు.

ఇవీ చూడండి.. పవర్ స్టార్​ ఫార్ములాను వదలని నితిన్

Last Updated : Nov 7, 2019, 10:58 PM IST

ABOUT THE AUTHOR

...view details