తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సంపూ 3.5 నిమిషాల సింగిల్​ షాట్​ డైలాగ్! - కొబ్బరిమట్ట

'కొబ్బరిమట్ట' చిత్రంలో సింగిల్ షాట్​ డైలాగ్​ను విడుదలచేసింది చిత్రబృందం. మూడున్నర నిమిషాల పాటు సంపూర్ణేశ్ బాబు చెప్పిన సంభాషణ ఆకట్టుకుంటోంది. ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

సంపూ

By

Published : Jul 28, 2019, 6:00 PM IST

బర్నింగ్ స్టార్​ సంపూర్ణేశ్ బాబు కొత్త చిత్రం 'కొబ్బరిమట్ట'. ఈ సినిమాలో సింగిల్​ షాట్​లో తీసిన డైలాగ్​ను విడుదల చేసింది చిత్రబృందం. దాదాపు మూడున్నర నిమిషాల పాటు ఉన్న ఈ డైలాగ్​ను సంపూ సింగిల్​ షాట్​లో చెప్పేశాడు. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సింగిల్​ షాట్​ డైలాగ్ ఇదేనని చిత్రబృందం తెలిపింది.

అలనాటి పౌరాణిక సంభాషణలకు పేరడీగా చెప్పిన ఈ డైలాగ్ కోసం సంపూ పది రోజులు ప్రాక్టీస్ చేశాడట. గుక్క తిప్పుకోకుండా అంతసేపు సంపూ చెప్పిన ఈ సంభాషణ ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో ఉంది. బర్నింగ్ స్టార్ కష్టం తెలుస్తోంది.

'పెదరాయుడు', 'ఆండ్రాయుడు', 'పాపారాయుడు' అనే మూడు విభిన్న పాత్రల్లో నటించాడు సంపూర్ణేశ్ బాబు. రూపక్ రొనాల్డ్​సన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. నీలమ్ సాయి రాజేశ్ నిర్మాతగా వ్యవహరించాడు.

ఇది చదవండి: ఫ్రెండ్​ కోసం ప్రేమలో పడ్డ 'మెంటల్ కృష్ణ'

ABOUT THE AUTHOR

...view details