వినోదాత్మక కథలతో అలరించే సంపూర్ణేష్ బాబు.. డాన్స్‌తో నవ్వించే ప్రయత్నం చేశాడు. 'కొబ్బరిమట్ట'లో అ.ఆ.. అనే పాట టీజర్లో సరికొత్తగా కనిపించాడు. "మీకు నచ్చుతుందని డాన్స్ ట్రై చేశాను" అని పోస్ట్ చేశాడు.
కొబ్బరిమట్ట కోసం సంపూ కిరాక్ డాన్స్
'హృదయ కాలేయం'తో పరిచయమైన సంపూర్ణేష్ బాబు వైవిధ్యభరిత నటనతో, నవ్వించే పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'కొబ్బరి మట్ట' విడుదలకు సిద్ధమైంది. ఇందులోని అ.ఆ.. అనే పాట టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
డాన్స్ ఇరగదీస్తున్న సంపూర్ణేశ్ బాబు
ఈ డాన్స్‌పై "సంపూ ఇరగదీశావు.. అన్నా డాన్స్ తో చంపేశావు.. మరో మైకేల్ జాక్సన్.." అంటూ కామెంట్లు పెడుతున్నారు ప్రేక్షకులు. ఈ చిత్రం ఆగష్టు 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది సంగతి: లేడీ మైకేల్ జాక్సన్.. కిర్రాక్ కత్రినా
Last Updated : Jul 16, 2019, 12:17 PM IST