తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'చిరు, పవన్‌ కోసం కథలు రాస్తున్నా' - పవన్ కల్యాణ తాజా వార్తలు

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్​లకు దర్శకత్వం వహించడమే తన కల అంటున్నారు దర్శకుడు సంపత్ నంది. అందుకోసం కథలు తయారు చేస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

పవన్
పవన్

By

Published : May 15, 2020, 8:26 PM IST

నటీనటులకు ఫలానా దర్శకుడితో పనిచేయాలని, దర్శకులకు ఫలానా హీరోలతో సినిమా తెరకెక్కించాలనే కల ఉంటుంది. దర్శకుడు సంపత్‌ నందికి ఇలాంటి డ్రీమ్‌ ఒకటుందట. ఇటీవలే ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారాయన. ప్రస్తుతం ఆయన గోపీచంద్‌ హీరోగా 'సీటీమార్‌' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా నాయిక.

లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడింది. ఈ విరామ సమయంలో కుటుంబంతో ఆనందంగా గడుపుతూ తదుపరి చిత్రాలకు కథలు రాసుకుంటున్నారు సంపత్. పవన్‌ కల్యాణ్‌తో సినిమా చేసేందుకు మంచి కథ సిద్ధం చేస్తున్నట్లు.. 'సీటీమార్‌' విడుదల అనంతరం పవన్‌ను కలిసి వినిపించనున్నట్లు తెలిపారు.

అంతేకాదు ఎంతోకాలం నుంచి చిరంజీవిని డైరెక్ట్‌ చేయాలనుకుంటున్నానని, తెలంగాణ రజాకార్ల నేపథ్యంలో కథ రూపొందించబోతున్నట్లు తన మనసులో మాట పంచుకున్నారు సంపత్ నంది. ఈ క్రేజీ ప్రాజెక్టులు ఎప్పుడు మొదలవుతాయో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిదే. 'ఏమైంది ఈ వేళ' చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు సంపత్‌. 'రచ్చ', 'బెంగాల్‌ టైగర్‌', 'గౌతమ్‌ నంద' సినిమాలతో మాస్‌ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details