బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్‌బాబు కొత్త చిత్రానికి '?' అనే విచిత్రమైన టైటిల్ పెట్టారు. మెడికల్ హారర్ కథతో రూపొందిస్తున్న దీని ఫస్ట్‌లుక్ పోస్టర్లను, అతడి పుట్టినరోజు సందర్భంగా నేడు విడుదల చేశారు. వుహాన్ గబ్బిలాల మార్కెట్లో చిత్రీకరించిన చివరి సినిమా ఇదేనని రాసుకొచ్చారు. రానున్న జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
వుహాన్ గబ్బిలాల మార్కెట్లో సంపూర్ణేశ్‌బాబు సినిమా - Sampoornesh Babu latest news
సంపూర్ణేశ్ బాబు హీరోగా నటిస్తున్న మెడికల్ హారర్ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్లు ఆక్టటుకుంటున్నాయి. వీటిలో డిఫరెంట్‌గా కనిపిస్తూ అలరిస్తున్నాడు సంపూ.
హీరో సంపూర్ణేశ్ బాబు
ప్రస్తుతం ప్రజల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ప్రాణాంతక కరోనా.. వుహాన్‌లోనే పుట్టింది. ఈ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన సంపూ కొత్త చిత్ర పోస్టర్లు ఆసక్తి రేపుతున్నాయి. 'హృదయ కాలేయం', 'కొబ్బరిమట్ట' నిర్మాతలే ఈ సినిమాను నిర్మిస్తున్నారు.