తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సమ్మతమే' గ్లింప్స్.. ఓటీటీలో 'శ్రీదేవి సోడా సెంటర్' - సమ్మతమే ఫస్ట్ గ్లింప్స్

టాలీవుడ్​కు సంబంధించిన కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'సమ్మతమే'(sammathame first glimpse), 'శ్రీదేవి సోడా సెంటర్'​(sridevi soda center ott)కు సంబంధించిన విశేషాలు ఉన్నాయి.

Sammathame
సమ్మతమే

By

Published : Oct 21, 2021, 5:19 PM IST

'రాజావారు రాణిగారు'తో కథానాయకుడిగా పరిచయమై 'ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం'తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు నటుడు కిరణ్‌ అబ్బవరం(kiran abbavaram movies). ప్రస్తుతం ఇతడు నటిస్తున్న చిత్రం 'సమ్మతమే'(sammathame first glimpse). గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కిరణ్‌కు జోడీగా 'కలర్‌ ఫొటో' ఫేమ్‌ చాందినీ చౌదరి కనపించనుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ మూవీ ఫస్ట్‌ గ్లింప్స్​(sammathame first glimpse)ను చిత్రబృందం గురువారం సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసింది. యూత్‌ఫుల్‌ ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమా సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది.

సుధీర్ బాబు(sudheer babu movies), ఆనంది హీరోహీరోయిన్లుగా 'పలాస' ఫేమ్ కరుణాకర్ తెరకెక్కించిన చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'(sridevi soda center ott). ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. తాజాగా ఓటీటీ(sridevi soda center ott)లో అలరించేందుకు సిద్ధమైంది. దీపావళి కానుకగా నవంబర్ 4 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.

శ్రీదేవి సోడా సెంటర్

ఇవీ చూడండి: ఐనాక్స్ బంపర్ ఆఫర్.. ఫ్రీగా సినిమాలు చూసేయండి!

ABOUT THE AUTHOR

...view details