తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'105 కిలోల బరువుతో ప్రెగ్నెన్సీ చాలా కష్టంగా' - సమీరారెడ్డి 105 కేజీలు

మాతృత్వంలో తనకెదురైన విభిన్న అనుభవాలను హీరోయిన్ సమీరారెడ్డి పంచుకున్నారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చే సమయంలోనూ అనుభవించిన కష్టాల గురించి వెల్లడించారు.

Sameera Reddy on weighing 105 kg
సమీరారెడ్డి

By

Published : May 10, 2021, 3:41 PM IST

తన తొలి కాన్పు సమయంలో చాలా కష్టంగా అనిపించింది అని, కానీ రెండోసారి కాన్పు అప్పుడు సులువుగానే అనిపించిందని నటి సమీరారెడ్డి చెప్పాడు. మాతృదినోత్సవం సందర్భంగా తన అమ్మతనంలో తీపి గుర్తులను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

"హాన్స్(కుమారుడు)​ నా కడుపులో ఉన్నప్పుడు, అందరు హీరోయిన్లలా బేబీ బంప్స్​తో పోజులు ఇవ్వచ్చనుకున్నాను. కానీ 9 నెలల తర్వాత నేను 105 కిలోల బరువు పెరిగాను. ఆ సమయంలో నాకేం సంతోషంగా అనిపించలేదు. ప్రసవం అయిన తర్వాత తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్లిపోయాను. అప్పుడు నా కుమారుడికి డైపర్​ మార్చడం, ఇతరత్రా పనులన్ని నా భర్తే చూసుకున్నారు."

భర్తతో సమీరారెడ్డి

తొలిసారి ప్రసవం తర్వాత మానసికి సమస్యలతో బాగా ఇబ్బందిపడ్డానని చెప్పిన సమీరారెడ్డి.. అప్పుడు హోమియోపతిని ఆశ్రయించినట్లు ఆమె పేర్కొంది.

"నీ పిల్లాడు ఆరోగ్యంగా ఉన్నాడు. నీకు అండగా నిలిచే భర్త తోడున్నాడు. నువ్వు ఎందుకు దిగులుగా ఉన్నావు? అని ప్రసవం తర్వాత నా అత్తయ్య నాతో అన్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయిన తర్వాత కూడా ఎక్కువగా హాన్స్​తో ఉండలేకపోయినందుకు చాలా బాధపడ్డాను. అప్పుడప్పుడు ఏడ్చేసేదాన్ని. ఇండస్ట్రీకి దూరమయ్యాను. ఆ సమయంలో ఇంకా 105 కిలోల బరువే ఉండటం, జుట్టు ఎక్కువగా రాలిపోతుండటం వల్ల హోమియోపతిని ఆశ్రయించాను. కొన్నాళ్ల ఆ చికిత్స తీసుకున్న తర్వాత ఓ కొత్త మనిషిలా మారాను" అని సమీరా వెల్లడించింది.

పిల్లలతో సమీరారెడ్డి

2012లో వచ్చిన 'తేజ్​' సినిమాలో చివరగా కనిపించిన సమీరారెడ్డి.. 2014లో పారిశ్రామికవేత్త అక్షయ్ వర్దేను పెళ్లి చేసుకున్నారు. వీరిక ప్రస్తుతం అబ్బాయి హాన్స్, పాప నైరా ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details