తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పసిబిడ్డతో సమీరా 'కొండంత' సాహసం - Sameera Reddy climbs Karnataka's highest peak with 2-month daughter Nyra

తెలుగు నటి సమీరారెడ్డి ఓ సాహసం చేసింది. తన రెండున్నర నెలల పాప నైరాను ఎత్తుకుని కర్ణాటకలోని ఓ పర్వతాన్ని ఎక్కేందుకు ప్రయత్నించింది. సగం దూరం వెళ్లేసరికి ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడటం వల్ల మధ్యలోనే వెనుదిరిగింది.

పసిబిడ్డతో సమీరా 'కొండంత' సాహసం

By

Published : Oct 1, 2019, 5:11 PM IST

Updated : Oct 2, 2019, 6:44 PM IST

తెలుగు తెరపై తన నటనతో ఎందరో ప్రేక్షకులను మెప్పించిన సమీరారెడ్డి... 2014లో వివాహం తర్వాత సినిమాలకు దూరమైంది. ఇటీవల రెండోసారి గర్భం దాల్చిన నటి.. జులై 12న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మూడు నెలలు కూడా నిండని ఆ పాపను ఎత్తుకొని ఓ సాహసం చేసింది.

కర్ణాటకలోని ముళ్లయనగిరి అనే పర్వత శ్రేణిని ఎక్కేందుకు సిద్ధమైంది. దాదాపు 6300 అడుగుల ఎత్తైన కొండను అధిరోహించేందుకు తన రెండు నెలల చిన్నారి నైరాను.. వీపుకు కట్టుకొని వెళ్లింది. సగం మెట్లు ఎక్కేసరికి ఊపిరి పీల్చుకునేందుకు కాస్త ఇబ్బంది పడింది. ఫలితంగా ఆ ప్రయత్నాన్ని మధ్యలోనే విరమించుకుంది. ఈ సందర్భంగా తన ఆసక్తిని వెళ్లడిస్తూ ఓ వీడియోను నెటిజన్లతో పంచుకుంది.

ఎందుకో తెలుసా..?

బాలింతలు, గర్భవతులు ఎలాంటి పనులు చేయకూడదని, బయట తిరగకూడదని కొన్ని ప్రాంతాల్లో అపోహలు ఉన్నాయి. వాటిపై అవగాహన పెంచేందుకు గర్భంతో ఉన్నప్పుడే నీటిలో ఈత కొట్టడం, జిమ్​లో వ్యాయామం చేయడం లాంటి ఫొటోలు పంచుకునేది సమీరా.

" నైరాను ఎత్తుకొని ముళ్లయనగిరి కొండ ఎక్కేందుకు వెళ్లాను. మార్గం మధ్యలోనే ఆగిపోయాను ఎందుకంటే ఊపిరి పీల్చుకోడానికి కాస్త ఇబ్బందిగా అనిపించింది. కర్ణాటకలో ఉన్న ఈ కొండ ఎత్తు 6300 అడుగులు. నేను చేసిన పని చాలా మంది అమ్మలకు స్ఫూర్తినిచ్చిందని నాకు సందేశాలు వస్తున్నాయి. నిజంగా నా ప్రయాణం కొంత మందిలో సానుకూల స్పందన కల్పించడం ఆనందంగా ఉంది".

-- సమీరా రెడ్డి, సినీ నటి

తెలుగులో జూనియర్​ ఎన్టీఆర్​తో కలిసి 'నరసింహుడు' సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది సమీరారెడ్డి. టాలీవుడ్​లో జై చిరంజీవ, అశోక్​, సూర్య సన్నాఫ్​ కృష్ణన్​, కృష్ణం వందే జగద్గురుమ్​ చిత్రాల్లోనూ నటించింది. 2014లో అక్షయ్​ అనే వ్యాపారవేత్తను పెళ్లాడిందీ నటి. 2015లో తొలికాన్పులో ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది.

Last Updated : Oct 2, 2019, 6:44 PM IST

ABOUT THE AUTHOR

...view details