Samantha Yashraj films: హీరోయిన్ సమంత విడాకుల తర్వాత కెరీర్లో దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ఈ ముద్దుగమ్మకు ఓ బంపర్ ఆఫర్ వరించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ .. తమ బ్యానర్లో మూడు సినిమాలు చేయాలని సామ్‌ను అడిగిందట. దీనికి ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు వినికిడి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే 'ఫ్యామిలీమ్యాన్' వెబ్‌సిరీస్‌తో బీటౌన్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సామ్.. తాజా ప్రాజెక్ట్‌లతో మరింత క్రేజ్‌ను సంపాదించుకునే అవకాశముంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.
సమంతకు బంపర్ ఆఫర్.. ఒకేసారి మూడు సినిమాలు! - సమంత బౌలీవుడ్ ఆఫర్
Samantha Yashraj films: స్టార్ హీరోయిన్ సమంతకు బాలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్.. తమ బ్యానర్లో మూడు సినిమాలు చేయాలని సామ్‌ను సంప్రదించిందట! దీనికి సామ్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
![సమంతకు బంపర్ ఆఫర్.. ఒకేసారి మూడు సినిమాలు! samanth yash raj films](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14212225-thumbnail-3x2-sam.jpg)
సమంత యశ్రాజ్ఫిల్మస్
కాగా, గుణశేఖర్ దర్శకత్వంలో సామ్ నటించిన 'శాకుంతలం' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటే 'యశోద్' అనే చిత్రం సహా పలు సినిమాల్లో నటిస్తోంది.
ఇదీ చూడండి:ఆ స్పెషల్ సాంగ్‌కు సమంతనే కరెక్ట్: దేవీశ్రీ ప్రసాద్