తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జిమ్​లో సమంత వర్కవుట్స్​ అదుర్స్​- జుకల్కర్​పై ఫన్నీ కామెంట్​! - samantha workout videos latest

Samantha workouts in gym: ఫిట్​నెస్ విషయంలో అస్సలు రాజీపడదు టాలీవుడ్ నటి సమంత. చూడటానికి క్యూట్​గా ఉండే సామ్ తన కసరత్తులతో అందరి మతులు పోగొడుతోంది. తాజాగా ట్రైనర్​ సమక్షంలో వర్కవుట్స్ చేస్తున్న వీడియోను ఇన్​స్టాలో పోస్ట్ చేసింది​.

Samantha workouts in gym
Samantha workouts in gym

By

Published : Jan 11, 2022, 2:16 PM IST

Updated : Jan 11, 2022, 4:20 PM IST

Samantha workouts in gym: కథానాయికలకు శరీరాకృతి, అందం, ఆరోగ్యం తప్పనిసరి. వాళ్లు ఏమాత్రం ఒళ్లు చేసినా సినీ అవకాశాలు పోయే అవకాశమూ ఉంటుంది! అందుకే రకరకాల వర్కవుట్స్​ చేస్తూ తమని తాము ఎప్పటికప్పుడు కొత్తగా మలుచుకుంటారు. ఈ జాబితాలో ప్రముఖ నాయిక సమంత ఎప్పుడూ ముందంజలో ఉంటుంది!

జిమ్​లో సమంత వర్కవుట్స్​

చూడ్డానికి క్యూట్‌గా కనిపించే సామ్‌.. నాజూకుగా ఉండేందుకు జిమ్​లో చేసే కసరత్తు మతి పోగొడుతుంది. ఫిట్​నెస్​ కోసం నిత్యం జిమ్​లో వర్కవుట్స్​ చేసే సామ్​.. తాజాగా ఫిట్​నెస్​ లెవల్స్​కి సంబంధించిన వర్కవుట్స్​ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఇందులో తన ట్రైనర్​ సమక్షంలో కొవ్వును కరిగించేందుకు వర్కవుట్స్​ చేసి.. నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ట్రైనర్ ప్రోత్సహిస్తుంటే.. ఉత్సాహంగా కసరత్తు చేసింది. తన అభిమానులకు కూడా ఛాలెంజ్​ విసిరింది. ఇది చూసిన నెటిజన్లు వావ్​ అంటూ కామెంట్​ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం సమంత ఏం చేసిందో మీరూ చూసేయండి..

ప్రీతం జుకల్కర్​పై ఫన్నీ కామెంట్​

తన గ్లామర్​ టీమ్‌కు లెవలప్​ ఛాలెంజ్‌ని విసిరింది సామ్​. ఆమె మేకప్ ఆర్టిస్ట్ అవ్నీ రంభియా, హెయిర్‌స్టైలిస్ట్ రోహిత్ భట్కర్​తో పాటు గతంలో సమంతతో సంబంధాలున్నట్లు వార్తలొచ్చిన స్టైలిస్ట్ ప్రీతం జుకల్కర్ కూడా ఇందులో ఉన్నాడు. అయితే సామ్​ విసిరిన ఛాలెంజ్​లో జుకల్కర్​ విఫలమయ్యాడు. దీంతో ఫన్నీ కామెంట్​ చేసింది సామ్​.

ఫిట్​నెస్​ ఛాలెంజ్​లో విఫలమైన జుకల్కర్​

చైతుతో విడాకులు తర్వాత తన గ్లామర్​ డోసును మరింత పెంచింది సమంత. ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలో 'ఊ అంటావా.. ఉఊ అంటావా..' ప్రత్యేక పాటతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. తన ఫిట్​నెస్​ మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.

ఇదీ చూడండి:'ఆ సమయంలో మరణం అంచుల వరకు వెళ్లొచ్చా'

Last Updated : Jan 11, 2022, 4:20 PM IST

ABOUT THE AUTHOR

...view details