Shakuntalam gunasekhar: డిఫరెంట్ సినిమాలతో కెరీర్లో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ సమంత.. ప్రస్తుతం పలు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తుంది. వాటిలో 'శాకుంతలం' ఒకటి. మహాభారతం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలోని సామ్ ఫస్ట్‌లుక్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై ఆత్రుత పెంచేసింది.
'శాకుంతలం' పాత్ర కోసం సమంత బరువు కూడా తగ్గి, స్లిమ్‌గా మారింది! ఆ విషయం ఫస్ట్‌లుక్‌లో క్లియర్‌గా కనిపిస్తోంది. అయితే లుక్‌తోనే కాకుండా యాక్టింగ్‌తోనూ ఆడియెన్స్ షాక్‌కు గురిచేస్తుందని డైరెక్టర్ గుణశేఖర్ చెప్పారు.