తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వెబ్​ సిరీస్​ కోసం తీవ్రవాదిగా సమంత..! - samantha act as terrorist

అక్కినేని కోడలు సమంత త్వరలోనే ఓ వెబ్​సిరీస్​లో నటించనుంది. ఇందులో ప్రతినాయక ఛాయలున్న పాత్ర​లో కనిపించనుందని సమాచారం.

సమంత

By

Published : Oct 11, 2019, 10:53 PM IST

Updated : Oct 12, 2019, 8:11 AM IST

ప్రముఖ కథానాయిక సమంత.. ఓ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు అంగీకారం తెలిపింది. అందులో ఆమె చేస్తున్న పాత్ర గురించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. 'ద ఫ్యామిలీ మ్యాన్‌' సీజన్‌-2లో ప్రతినాయక లక్షణాలున్న పాత్రలో కనిపించనుందని సమాచారం.

సమంత.. ఈ సిరీస్‌లో ఓ తీవ్రవాదిగా దర్శనమివ్వనుందని సమచారం. బాలీవుడ్‌ దర్శకులు రాజ్‌ నిడుమోరు, కృష్ణ డి.కె.లు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోచిత్రీకరణ ప్రారంభం కానుంది. మనోజ్‌భాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన 'ద ఫ్యామిలీ మ్యాన్‌'కు ఇది సీక్వెల్‌. ఈ సిరీస్‌తో పాటు శర్వానంద్‌ సరసన తమిళ చిత్రం '96' రీమేక్‌లోనూ నటిస్తోంది సమంత.

ఇవీ చూడండి.. ఆ స్టార్​ హీరో సీక్రెట్​ బయటపెట్టిన సన్నీలియోనీ

Last Updated : Oct 12, 2019, 8:11 AM IST

ABOUT THE AUTHOR

...view details